అంతర్జాతీయం

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.. పశ్చిమాసియాలో అణుబాంబుల హోరు

మూడో ప్రపంచ యుద్దానికి ఆరంభం మొదలైందని కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఒక్కసారిగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్, లెబనాన్ హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ దాడికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా దళాలు వందల రాకెట్లను ప్రయోగించింది. డ్రోన్లతో చెలరేగిపోయింది. పోటాపోటీ దాడులతో రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా అలర్టైంది. తమ యుద్ధ నౌకలను ఇజ్రాయెల్‌ సమీపానికి పంపించింది. అటు ఇరాన్ కూడా అప్రమత్తమైంది. గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం ఆందోళన కల్గిస్తోంది.

ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాల మధ్య కొన్ని రోజులుగా కవ్వింపు దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో.. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధంమొదలైందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

లెబనాన్‌పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా రాకెట్‌ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్‌బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్‌ శోషానీ తెలిపారు.ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు ఫైటర్లు మృతి చెందారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నహరియా అనే నౌకపై హెజ్‌బొల్లా దాడులు చేసింది. ఉత్తర ప్రాంతంలో హెజ్‌బొల్లా జరిపిన ఈ దాడిలో ఒక నౌకాదళ అధికారి మరణించారని, ఇద్దరు గాయపడ్డారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. తమ సైనిక స్థావరాలేవీ దెబ్బతినలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ బోట్లపై దాడులు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.హెజ్‌బొల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించాకే తాము దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రయోగించిన వందలకొద్దీ రాకెట్లను అడ్డుకున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు చెప్పారు. తమకు నష్టం కలగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామని స్పష్టం చేశారు.ఇది ముగింపు కాదని తేల్చి చెప్పారు.

తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫవాద్‌ షుకుర్‌ను గత నెలలో ఇజ్రాయెల్‌ చంపేసిందుకు ప్రతీకారంగానే తాము దాడులకు దిగినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. మొత్తం 320 కత్యూషా రాకెట్లతోపాటు డ్రోన్లను ప్రయోగించామని తెలిపింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని హెజ్ బొల్లా స్పష్టం చేసింది.హెజ్‌బొల్లా దాడులను హమాస్‌ ప్రశంసించింది. ఇజ్రాయెల్‌ దాడులకు దీటుగా సమాధానమిచ్చిందని తెలిపింది.

 

Related Articles

Back to top button