క్రైమ్

భార్యపై కోపంతో కారు యాక్సిడెంట్ చేసిన వ్యాపారి

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పోర్షే కారు యాక్సిడెంట్ లో ట్విస్ట్ వెలుగు చూసింది. భార్య పై కోపంతో వ్యాపారవేత్త కావాలనే యాక్సిడెంట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పండగపూట భార్యతో తగాదా పడ్డారు వ్యాపారవేత్త దీక్షిత్. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఆవేశాన్ని ఆపుకోలేక మితిమీరిన వేగంతో కారు నడిపాడు. రాత్రంతా కారును వేగంగా నడుపుతూ.. సిటీలో చక్కర్లు కొట్టారు దీక్షిత్.

శుక్రవారం తెల్లవారుజామున కేబీఆర్‌ పార్క్ వద్ద దీక్షిత్ కారు కి ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి kbr పార్క్ ప్రహారీ గోడను ఢీ కొట్టాడు దీక్షిత్. బెలూన్‌లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత ఘటనాస్థలం నుంచి దీక్షిత్ పరార్ అయ్యాడు. కారుకి నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో కారు ఇంజన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రమాదానికి కారణమైన ఉత్సవ్ దీక్షిత్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.

Back to top button