చండూరు,క్రైమ్,మిర్రర్: బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని నల్గొండ డీస్పీ శివరాంరెడ్డి వైన్ షాప్ ఓనర్లను హెచ్చరించారు. ఈ మేరకు చండూరులోని సిఐ కార్యాలయంలో సోమవారం మునుగోడు, చండూరు, ఘట్టుప్పల మండలాలలోని వైన్ షాపుల ఓనర్లతో సమావేశం నిర్వాయించారు. ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాప్ లకు ఎటువంటి మద్యం అమ్మవద్దని అలాగే, పరిమితికి మించి ఎవరికి మద్యం ఇవ్వవద్దని ఇచ్చినచో వైన్ షాప్ల ఓనర్ ల పైన కేసులు నమోదు చేయబడును అన్నారు. మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లో మద్యం విక్రయించ వద్దన్నారు. గ్రామాలలో బెల్టు షాపులు నిర్వయించకుండా గట్టిగా నిఘా పెట్టాలని పోలీస్ సిబ్భందికి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారి పైన కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశాలో ఆయా మండలాల ఎస్సైలు పాల్గొన్నారు.
5,200 Less than a minute