తెలంగాణ

బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు సీరియస్

బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై స్టే ఇచ్చింది. అక్టోబర్ 1వరకు ఎలాంటి బుల్డోజర్ కూల్చివేతలు చేయవద్దంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్, రైల్వే లైన్లు, చెరువులు, ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నేరారోపణలో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వాలు బుల్డోజర్ల ద్వారా నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ప్రైవేట్ స్థలాలను బుల్డోజర్ల ద్వారా కూల్చివేయడం సరైన చర్య కాదని పేర్కొంది.

Read More : పాతబస్తీ హిందువులదే.. వాళ్లను తరిమేస్తం…

దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ ఆస్తులను అనధికారికంగా కూల్చివేయడంపై అక్టోబరు 1 వరకు స్టే విధించింది. కూల్చివేతలపై స్టే విధిస్తే.. ఇప్పటికే కూల్చివేతలకు సిద్ధమైన పనులపై ప్రభావం చూపుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించగా.. ఆయన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బుల్డోజర్ కూల్చివేతలు ఆపితే స్వర్గం ఏమి ఊడిపడదని ధర్మాసనం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్, రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలపై చర్యలకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. వాటికి ఈ ఉత్తర్వులు అమలు కావని స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button