ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

బాబు కోసం రేవంతే రచ్చ చేయించారా! రగిలిపోతున్న దేవర ఫ్యాన్స్

హైదరాబాద్ నోవోటెల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ జరిగింది. ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎగబడ్డారు. పాసులు దక్కని అభిమానులు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించించారు. దీంతో నోవోటెల్ లో తోపులాట, ఉద్రిక్తత ఏర్పడింది. హోటల్లోని అద్దాలు ధ్వంసమయ్యాయి.

నిజానికి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్డ్ ఆడిటోరియానికి ఈవెంట్ ని మార్చాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే కొంతమంది అభిమానులకు ఫ్యాన్స్ పాసులు, విఐపి పాసులు, ఎంఐపి పాసులు జారీ చేశారు. అయితే పాసులు దక్కని అభిమానులు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హోటల్లోని అద్దాలు ధ్వంసం చేశారు. రచ్చ జరగడంతో పోలీసులు ఈవెంట్ ను రద్దు చేశారు. దీంతో దేవర ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోయారు. ఈవెంట్ రద్దు వెనుక కుట్ర ఉందన్నారు. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జూనియర్ ను ఇబ్బంది పెట్టడానికే కొందరు కావాలనే ఇలా చేశారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి కుట్ర వల్లే దేవర ఈవెంట్ రద్దైందని కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది అభిమానులు వస్తారని తెలిసినా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేదని.. గొడవ జరిగేలా చూశారని ఆరోపించారు. ఈవెంట్ నిర్వహించిన శ్రేయాస్ మీడియా కుట్ర కూడా ఇందులో ఉందని ఆరోపించారు. చంద్రబాబు కోసమే సీఎం రేవంత్ జూనియర్ సినిమాను టార్గెట్ చేశారంటు కొందరు దేవర ఫ్యాన్స్ నినాదాలు చేశారు.

మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు పై ఎన్టీఆర్ స్పందించారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరమన్నారు. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దాం అని ఎగ్జైటెడ్ గా వున్నా..సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది..అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నా అంటూ జూనియర్ వీడియో విడుదల చేశారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడం నిర్మాతదో లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్ అన్నారు తారక్.అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మాంతం రుణపడి ఉంటా.. ఈ రోజు కలవకపోయినా సెప్టెంబర్ 27 న అందరం కలవబోతున్నాం..మీరు కాలర్ ఎగరేసుకుని తిరగడమే నా బాధ్యత దాంతో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను అంటూ భావోద్వేగంతో చెప్పారు జూనియర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button