క్రైమ్

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి

30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ అడ్డంగా దొరికిన ఘటన

ఖమ్మం, క్రైమ్ మిర్రర్ : ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ సంబంధిత పనులకు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ ఇద్దరూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వీరిద్దరూ రూ.30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు. సమాచారం అందుకున్న అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి ఆధారాలతో పాటు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Back to top button