తెలంగాణ

నల్గొండ-హైదరాబాద్‌ నాన్‌స్టాప్‌ ఏసీ బస్సుల ప్రారంభం…

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నల్గొండ ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ నాన్‌స్టాప్‌, మూడు డీలక్స్‌ బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చాక తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, గతంలో రోజుకు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వారి సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. దీంతో బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోతుంది.

Also Read : డేంజర్.. వాటర్.. మిషన్‌ భగీరథ నీటీలో వానపాములు…!!

ఈ నేపథ్యంలో కొత్తగా 1000 బస్సులు కొనుగోలు చేశామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల గురించి కూడా కీలక ప్రకటన చేశారు. వారికి ఇప్పటికే 21 శాతం డీఏ ఇచ్చామని వెల్లడించారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన రూ.200 కోట్లను జులై నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టామని త్వరలోనే భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాలకు లగ్జరీ బస్సులు నడిపించనున్నట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని.. కొత్త బస్సుల రాకతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ!!
  2. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!
  3. చండూరు సంతలో రెచ్చిపోతున్న సెల్ ఫోన్ దొంగలు…
  4. కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు… ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ!!

 

Spread the love
Back to top button