తెలంగాణ

ధూంధాంగా మస్తాన్ రెడ్డి నామినేషన్

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : శ్రీ వివేకానందనగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో దేవరింటి మస్తాన్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేశారు. తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందించారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన మస్తాన్ రెడ్డి.. కాలనీలోని దేవాలయాల్లో పూజలు చేశారు. మస్తాన్ రెడ్డికి మద్దతుగా కాలనీ ఓటర్లు ర్యాలీలో పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తన గెలుపు ఖాయమన్నారు మస్తాన్ రెడ్డి. ఈ నామినేషన్ కార్యక్రమంలో మొయినుద్దీన్, రవి ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య ముదిరాజ్, చెల్లయ్య, రాజా రెడ్డి, ఆది నారాయణ, సత్య నారాయణ, జానకీరాం, సతీష్ రెడ్డి , అనిల్ పాల్గొన్నారు.

మస్తాన్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు :- శ్రీ వివేకానందనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దేవరింటి మస్తాన్ రెడ్డికి భారీగా మద్దతు లభిస్తోంది. మస్తాన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు కెల్లా శ్రీలతా వెంకట్రావు.ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన శ్రీలతా వెంకటరావు.. మస్తాన్ రెడ్డి బరిలో ఉండటంతో తన నిర్ణయం మార్చుకున్నారు. విద్యా వంతుడు, సేవా గుణం ఉన్న మస్తాన్ రెడ్డితో కాలనీకి మరింత మేలు జరుగుతుందనే భావనతో పోటీ నుంచి తప్పుకుని మస్తాన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. తన కోసం పోటీ నుంచి తప్పుకున్న శ్రీలతా వెంకట్రావును మస్తాన్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొయినోద్దీన్, రవి ముదిరాజ్, చెల్లయ్య, కనకయ్య ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, ఏ. రమేశ్, ఆదినారాయణ, సత్యనారాయణ మరియు ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button