తెలంగాణ

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు అర్హత ఉండటంతో.. అవి లేకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు పెద్ద ఆటంకంగా మారింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన  చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామన్నారు.

Also Read : గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం…

కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికీ ఇవ్వాలన్నదానిపై చర్చించి.. మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డు వేరేగా.. ఆరోగ్యశ్రీ కార్డు వేరేగా ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు రేషన్ కోసం.. ఆరోగ్యశ్రీ వైద్యం కోసం అని తెలిపారు. వాస్తవానికి చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు అందించలేదు.. దీంతోపాటు కార్డుల్లో మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా జరగలేదు.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ.. ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : 

  1. విద్యుత్ బకాయి బిల్లు చెల్లించమంటే అధికారిపై దాడి.. కేసు నమోదు!!
  2. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్..
  3. శంకర్‌పల్లి 8వ వార్డులో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్..
  4. వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత రాయల చంద్రశేఖర్‌ ఆత్మహత్య…
  5. ప్రజా పాలన దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్…

Related Articles

Back to top button