తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారానే అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తిరుమల లడ్డూ వాడిన కల్తీతో గొడ్డు మాంసం కొవ్వు అవశేసాలు ఉన్నాయనే వార్తలు వెంకన్న భక్తులను కలవరపాటుకు గురి చేశాయి. లడ్డూ అంశంలో స్వతంత్ర సిట్ విచారణకు ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. సిట్ విచారణలో ఏం తేలుతుందన్నది ఆసక్తిగా మారింది.
తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతుండగానే శ్రీవారి సన్నిధిలో మరో అపచారం వెలుగు చూసింది. తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి దర్శనమిచ్చింది. టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కవిపించింది. దీంతో షాకైన భక్తుడు పరుగులు తీశాడు. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించారు భక్తలు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తమని వెళ్ళిపోమన్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి భక్తులు డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయమే భక్తలతో నడవడిక, అన్నదానంపై టిటిడి అధికారులను హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పెరుగన్నంలో జెర్రీ రావడం కలకలం రేపుతోంది.
టీటీడీ అన్నదాన సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రీ రావడాన్ని వైసీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. జెర్రీ వచ్చిన పెరుగన్నం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదేందయా చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ కార్యకర్తలు.