తెలంగాణ

కొండా సురేఖకు తీన్మార్ మల్లన్న మద్దతు.. నాగార్జున అంతు చూస్తానని వార్నింగ్

కేటీఆర్-సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఏకాకి అయ్యారు. సినీ ఇండస్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖపై మూకుమ్మడి దాడి చేస్తున్నా.. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలెవరకు మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రకటన చేశారు. కాని అది ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ నేతలెవరు కొండా సురేఖకు మద్దతుగా లేని సమయంలో ఆమె కోసం రంగంలోకి దిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. హీరో నాగార్జునకు వార్నింగ్ ఇచ్చారు. బీసీ కాబట్టే కొండా సురేఖను టార్గెట్ చేశాడంటూ మండిపడ్డారు.

కొండా సురేఖను అంతా కలిసి వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ మంత్రి కాబట్టే.. కాలు దువ్వుతున్నావు కదా..దువ్వు.. నీ సంగతేంటో చూస్తాం బిడ్డా.. అంటూ నాగార్జునపై మండిపడ్డారు.గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే.. ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు. నాగార్జునుపై తాజాగా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.

Back to top button