క్రైమ్జాతీయం

కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్.. ఒకేసారి ఐదుగురు.. కోమాలో బాలిక

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అతికిరాతకంగా వ్యవహరిస్తున్నారు.కోల్‌కతాలో డాక్టర్ పై అత్యాచారం చేసి చంపేసిన ఘటన యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది. ఈ ఘటన మరుకవ ముందే మరో కిరాతకం జరిగింది. ఉత్తరాఖండ్‌లో కదులుతున్న బస్సులో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతరాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మరో ముగ్గురు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

ఈ గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న అర్ధరాత్రి అంతరాష్ట్ర బస్ టెర్మినల్ 12వ నంబర్ ప్లాట్ ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుంది. ఈ విషయాన్నికొంతమంది జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. వెంటనే కమిటీ సభ్యులు ఆ బాలికను బాలానికేతన్ కేంద్రానికి తరలించారు. వివరాలపై ఆరా తీయగా ఆ బాలిక బస్సులో జరిగిన అత్యాచారం సంగతిని బయటపెట్టింది.రంగంలోకి దిగిన డెహ్రాడూన్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు

పోలీసుల దర్యాప్తులో బాధితురాలు స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ అని చెప్పింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి.. అక్కడినుంచి డెహ్రాడూన్ వచ్చినట్లు విచారణలో తెలిపింది. అయితే బస్సు డెహ్రాడూన్ వచ్చిన తర్వాత ప్రయాణికులు దిగిపోయారు.ఈ సమయంలో తొలుత డ్రైవర్, కండెక్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు అజయ్ సింగ్ చెప్పారు. అనంతరం పక్కన బస్సులు నిలిపిన ఇద్దరు డ్రైవర్లతోపాటు ఆ బస్టాండ్ లోని క్యాషియర్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డినట్లు తేలింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Related Articles

Back to top button