తెలంగాణ

అవినీతి ఆరోపణలు, తోటి సిబ్బందితో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కిందిస్థాయి సిబ్బందితో గొడవల కారణంగా ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఎస్సైని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం (జూన్ 30) ఉదయం కొత్త చట్టాలపై స్టేషన్ సిబ్బందికి ఎస్సై శ్రీనివాస్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన తన సొంత కారులో స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Also Read : ఇదేమి పోలీసింగ్… సార్లు?!… తెలంగాణ పోలీసుల వ్యవస్థకే తలవంపులు తెచ్చేలా చింతపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డు బిహేవియర్

కాసేపటికి ఎస్సై ఫోన్‌కు స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయగా.. రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో కంగారుపడిని స్టేషన్ సిబ్బంది సీఐ జితేందర్ రెడ్డికి విషయం చేరవేశారు. ఆయన వెంటనే ఎస్పీ రోహిత్ రాజ్‌కు సమాచారం అందించారు. ఎస్సై మిస్ అయినట్లు భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను బరిలోకి దించాయి. ఆయన కారు మహబూబాబాద్ జిల్లా కేంద్రం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఎస్సై తన ఫోన్ ఆన్ చేశారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో తాను పురుగుల మందు తాగానని 108 సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది ఎస్సైను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే ఎస్సై ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బందితో గొడవలే కారణంగా తెలుస్తోంది.

Read Also : ఆపార్టీలోనే నాప్రయాణం.. పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి!!

గత కొంత కాలంగా ఎస్సై శ్రీనివాస్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా, పేకాట స్థావరాలు, ఇల్లీగల్ దందాలపై ఫోకస్ పెట్టిన ఎస్సై.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బు పంపకాల విషయంలో స్టేషన్ సిబ్బందికి ఎస్సైకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలిసింది. ఎస్సై తమ వాటా డబ్బులు ఇవ్వకపోవటంతో స్టేషన్‌లో జరిగే ప్రతి విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. దానికి తోడు సిబ్బంది ఎస్సైకి సపోర్టు చేయకుండా సహాయ నిరాకరణకు దిగినట్లు సమాచారం. మెుత్తంగా గత నాలుగు నెలల్లోనే ఎస్సై శ్రీనివాస్‌కు నాలుగు మెమోలు జారీ అయినట్లు తెలిసింది. ఎస్పీ రోహిత్ రాజ్ సైతం ఇటీవల ఎస్సై శ్రీనివాస్‌ను తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!!
  2. కాంగ్రెస్ పార్టీలోకి రావద్ధంటు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దహనం..
  3. అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు — గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
  4. ఉప్పల్ బగాయత్‌లో దారుణం.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!
  5. లక్కీ యెస్ట్ ఫెల్లో.. ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి!!
Back to top button