
ఈరోజు సినీ ప్రముఖులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ మీటింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి చెప్పకొచ్చారు.
BBL లో ఒకే ఓవర్ లో 4,4,4,4,4,4 కొట్టిన డకేట్!…
అల్లు అర్జున్ పై నాకు ఎటువంటి కోపం లేదు. అయినా అసలు నాకు అల్లు అర్జున్ పై కోపం ఎందుకు ఉంటుంది. అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అలాగే అల్లు అర్జున్తో కలిసి చాలా చోట్ల కూడా తిరిగానని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఎలా ఉన్నా కానీ చట్ట ప్రకారం వ్యవహరించాలనేదే నా విధానం అని అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేడు CM ను కలవనున్న హీరోలు, నిర్మాతలు వీళ్లే?
అయితే నిన్న,మొన్నటి వరకు అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ రేవంత్ రెడ్డి తాజాగా బన్నీ గురించి ఇలా మాట్లాడడం ప్రతి ఒక్కరిని కూడా షాకు కు గురిచేస్తుంది. సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకురాగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సినీ పెద్దలు చెప్పారు. అలాగే ఈ భేటీలో రేవంత్ రెడ్డి తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండవని చెప్పేశాడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా ఉంటానని తెలిపాడని నిర్మాతలు, డైరెక్టర్లు చెప్తున్నారు.
ఇకపై ఇలా చేస్తే మరణశిక్షే!… రేపిస్టులకు ట్రంప్ మాస్ వార్నింగ్?