తెలంగాణ

గుండాల మండల ఆశ వర్కర్స్ ముందస్తు అరెస్ట్

గుండాల క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:-ఆశా వర్కర్స్ కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించేలా అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించిన వేతనం అమలు చేయాలని గుండాల మండల సుద్దాల ఆశ కార్యకర్తల సంఘం కాసం శోభ డిమాండ్‌ చేశారు.
సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గుండాల మండలం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ ముందస్తు అరెస్ట్ పై వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ కార్యకర్తలకు అతి తక్కువ వేతనం చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాదబీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మద్దూర్ లో అందుబాటులో లేని వెటర్నరీ డాక్టర్ సిబ్బంది!..

ఏఎన్‌ఎం శిక్షణ పూర్తిచేసిన ఆశాలకు ఏఎన్‌ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, ఏఎన్‌ఎం పోటీ పరీక్షలో వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశా వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో దశల వారీగా పోరాడతామని హెచ్చరించారు.ముందస్తు కోసము అరెస్టు అయిన ఆశ ఆశ వర్కర్స్ సుజాత, శోభ, రామ, సరిత, జయలక్ష్మి ,నవనీత, లక్ష్మి తదితరులు అరెస్ట్ అయ్యారు.

In Telangana : రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా..? ఓవర్‌ కాన్ఫిడెన్సా..?

Back to top button