క్రైమ్

ఇన్ స్టాగ్రామ్ లో వేధింపులు.. నటి కల్పికపై మరో కేసు!

Case On Kalpika Ganesh: సినీ నటి కల్పిక గణేష్ మీద మరో కేసు ఫైల్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు వేధింపులకు పాల్పడినట్లు కీర్తన అనే అమ్మాయి ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్‌ లైన్‌ లో అభ్యంతరకరమైన రీతితో వేధింపులకు  పాల్పడుతోందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన గురించి స్టేటస్ పెట్టడంతో పాటు మెసేజ్ పెట్టి దారుణంగా మాట్లాడిందని వెల్లడించింది. ఇన్‌ బాక్స్ మెసేజ్‌ లు, స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించింది. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కల్పిత మీద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే కల్పికపై కేసు

ఇప్పటికే నానక్‌ రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లోని ప్రిజం పబ్‌ వ్యవహారంలో కల్పికపై కేసు నడుస్తోంది. గత నెల 29న ప్రిజం పబ్‌ కు వెళ్లిన కల్పిక, అక్కడ కేక్‌ విషయంలో పబ్‌ సిబ్బందితో గొడవ పడింది. ఆ సమయంలో కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించిందని పబ్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పబ్ లోని వస్తువులను విసిరి వేయడంతో పాటు సిబ్బందిని నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిందని వెల్లడించింది. పోలీసుల సమక్షంలోనే హంగామా చేసిందని తెలిపింది. ఈ ఘటనపైనా పోలీసులు కల్పికపై కేసు నమోదు చేశారు.

పబ్ వ్యవహారంపై స్పందించిన కల్పిక

అటు పబ్ లో జరిగిన వివాదంపై కల్పిక స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. కేక్ విషయంలో తాను దురుసుగా వ్యవహరించలేదని.. సిబ్బందే తన పట్ల దురుసుగా వ్యవహరించారని చెప్పింది. తనను డ్రగ్ ఎడిక్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే వారితో గొడవకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆ గొడవ కాస్త ముదరడంతో తన మీదే అసత్య ప్రచారాలు చేశారని వెల్లడించింది. పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పినా, తిరిగి తన మీదే పోలీసులు కేసు పెట్టారని చెప్పుకొచ్చింది.

Read Also: ఆధారాలు లేని అభియోగాలు వద్దు, మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Back to top button