
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని వట్టిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల సమక్షంలో మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సన్నబియం పంపిణీ కార్యక్రమం, నేడు పేదలకు వరమని, నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణి ప్రజల కడుపు నింపుతుందని, గత ప్రభుత్వాలు చెయ్యలేని పనిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి, ఇచ్చిన మాట ప్రకారం సన్న అందిస్తుందని కొనియాడారు..
గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.. సన్న బియ్యం పంపిణీని అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఉప్పు శివశంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సల్వోజు బిక్షమాచారి, నాయకులు మెండు నర్సింహ రెడ్డి, బిచ్య నాయక్, బాలయ్య, నీల మహేష్, కొడాల అల్వాల్ రెడ్డి, పెద్ద వెంకట్ రెడ్డి, గంట యాదయ్య, బట్టు అనంత రెడ్డి, ఏనుగుల వెంకట్ రెడ్డి, బండి ముత్యాలు, అబ్బాస్, సల్మాన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.