టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.186 కోట్ల (గ్రాస్) కలెక్షన్లు సాధించింది. అయితే పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాగా పలు చోట్ల పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
అయితే రిలీజ్ రోజే గేమ్ ఛేంజర్ సినిమా హెచ్ డి ప్రింట్ ఇంటర్ నెట్లో రిలీజ్ అయ్యింది. పలువురు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని గేమ్ ఛేంజర్ పీఆర్ టీమ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గేమ్ ఛేంజర్ పీఆర్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరారు. అలాగే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నవారిపై చర్యలు పలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ పై ఫిర్యాదు చేశారు.
ఇవి చదవండి
1.మకరజ్యోతి ఆరంభం !… శబరిమళలో భారీ బందోబస్తి?
2.చలి, మంచు వాతావరణంలో చైనా ఆర్మీ విన్యాసాలు!