
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని బస్తేపూర్ గ్రామ శివారులో పక్క సమాచారంతో మాదాపూర్ యస్ఓటీ మరియు చేవెళ్ల పోలీసుల ఆధ్వర్యంలో మహారాష్ట్ర లోని హంట్వాడి గ్రామం, సంగ్లి జిల్లా మహారాష్ట్ర నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలోనీ ఆంధ్ర ఫర్ప్యూమ్ ఫ్యాక్టరీకి 1000 కిలోల శ్రీగంధం (తెల్ల గంధం) వీటి విలువ సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఉంటుందని చేవెళ్ల ఏసిపి కిషన్ తెలిపారు.
గంధం చెక్కలను తరలిస్తున్న MH25AJ3689 DCM ను పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్వైజర్ సోహెబ్, మరియు రైతు విజయ్ హనుమంత్ మానె అదుపులోకి తీసుకున్నారు మిగతా ఇద్దరు ఫ్యాక్టరీ ఓనర్ అబ్దుల్ కుర్వి మరియు మేనేజర్ సిద్దిక్ పరారీలో ఉన్నారు.
పట్టుకున్న వారిని రిమాండ్ కు తరలించారని మిగతా వారి గురించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ యొక్క ఆపరేషన్ లో మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్, ఎస్ఐ లు సతీష్, అజయ్ మరియు సిబ్బంది మరియు రవి కుమార్ ఫారెస్ట్ అధికారి, మరియు చేవెళ్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం మారిన పూర్తి కానీ ప్రభుత్వ పాఠశాల..వర్షంలో తడుస్తూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు!