ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై మండిపడ్డ హైకోర్టు..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై తాజాగా రాష్ట్ర హైకోర్టు మండిపడింది. అసలు పోలీసులు రాష్ట్రంలో విధినిర్వర్తులు సరిగా పాటిస్తూ సక్రమంగా చేస్తున్నారా అని దుయ్యబట్టింది. రాష్ట్రంలో తమ ఆదేశాలను లెక్క చేయట్లేదు అంటూ పోలీసులపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి పడితే వాళ్లపై కేసులు పెట్టడం.. వారిని విపరీతంగా కొట్టడం.. తీరా ప్రశ్నిస్తే లోపల ఎడమే తప్ప మీరు ఏం చేస్తున్నారు అంటూ పోలీసులపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఒక మనిషి పై ఎన్నో కేసులు పెట్టి లోపల వేస్తున్నారే తప్ప… ఏ కేసులోనూ ఏ వ్యక్తిపై దర్యాప్తు సరిగా చేయడం లేదని మండిపడింది. ఇలాంటి తీరును మేము అసలు సహించబోమని హైకోర్టు తీవ్రంగా ఏపీ రాష్ట్ర పోలీసులకు హెచ్చరించింది. తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరు పై కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు అందరు కూడా అప్రమత్తమయ్యారు.

నేడే గ్రూప్స్ -2 మెయిన్స్ ఎగ్జామ్… అన్ని ఏర్పాట్లు రెడీ: ఏపీపీఎస్సీ

2020 సంవత్సరము నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడు లేనటువంటి కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు ఎన్ని కేసులకు దర్యాప్తు చేశారు… ఎన్ని కేసులకు దర్యాప్తు చేసి విచారణ చేపట్లేదో.. అనే విషయాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా రాష్ట్రంలోని పోలీసులకు హెచ్చరికలు చేస్తుండడంతో వీటిపై మరింత ఆందోళన అనేది రేకెత్తుతోంది. తప్పుచేసి చేయని వారిపై కూడా అనుమానాస్పాద రీతిలో ప్రజలను పోలీసులు భయపెడుతున్నారంటూ సోషల్ మీడియాలలో చాలానే చూసాం. పోలీసులంటేనే ప్రజలు చాలా వరకు భయపడుతున్నారు.

చంద్రబాబు పై నోరు అదుపులో పెట్టుకో కేసిఆర్, జగదీష్ ఖబర్దార్ : పిఎసిఎస్ చైర్మన్ రాములు యాదవ్

చోరీకి గురైన సెల్‌ఫోన్‌… బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన దొంగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button