
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తాజాగా తన కూతురిని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. మహమ్మద్ షమీ కూతురు ఐరా పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నటువంటి ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. ఐరా చిన్నప్పటి డ్యాన్స్ అలాగే ఐరా తో గడిపినటువంటి మధుర క్షణాలను మొహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన కూతురుని గుర్తు చేసుకున్నారు. దేవుడి దయా అనేది తన కూతురిపై ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లుగా మహమ్మద్ షమీ ఇన్స్టా లో తన కూతుర్ని హత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు.
కాగా మహమ్మద్ షమీ మరియు తన భార్య హసీన్ జహన్ ఇద్దరు కూడా కొన్నేళ్ల కిందట విడిపోయిన విషయం ఇండియాలో క్రికెట్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా తెలిసే ఉంటుంది. వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో విడాకుల బాధను గుర్తు చేసుకుంటూనే… ఓడి వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మొహమ్మద్ షమీ ఆకట్టుకున్నాడు. విడాకుల బాధలో ఉన్నా కూడా మహమ్మద్ శమీ దేశం కోసం అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ప్రతి ఒక్కరు కూడా శభాష్ అన్నారు. ఆ సమయంలో మహమ్మద్ షమీ తన భార్య ఇద్దరు కూడా కలవాలని చాలామంది కోరుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. ఏది ఏమైనా కూడా మహమ్మద్ శమీ తన కూతురు ఐరా పుట్టినరోజును గుర్తుంచుకొని.. తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఉన్నటువంటి ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసి ఎమోషనల్ అవ్వడం అనేది షమీ అభిమానులను బాధకు గురయ్యేలా చేసింది. కాగా విడాకులు తీసుకున్నప్పటినుంచి ఐరా తన తల్లి వద్దనే ఉంటుంది.