
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : ఓ మహిళతో సహజీవనంలో ఉన్న వ్యక్తి, ఆమె కుమార్తెను పెళ్లి చేసుకుంటానంటూ ఒత్తిడి చేస్తున్న ఘటన రాజానగరం మండలంలో వెలుగుచూసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పి. నాగిరెడ్డి అనే వ్యక్తి 2016లో భర్త మృతి చెందిన తర్వాత ఆమెతో పరిచయం పెంచుకొని సహజీవనం కొనసాగించాడు. ఈ సమయంలో ఆమె కుమార్తెను పెళ్లి చేసుకుంటానంటూ వేధించేవాడని ఆరోపించారు.
ఆ తర్వాత నాగిరెడ్డి మరో యువతిని వివాహం చేసుకొని కుటుంబం ప్రారంభించాడు. కొద్దికాలం తర్వాత భార్య, బిడ్డలను వదిలేసి మళ్లీ పూర్వ సహజీవన మహిళ వద్దకు వచ్చి, ఆమె కుమార్తెను పెళ్లి చేయాలంటూ బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇంతటితో ఆగకుండా అతడి తల్లి కూడా స్టేషన్ వద్దే బాధితురాలి కుమార్తెపై దాడికి దిగిందని ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలైన బాలికను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.