తెలంగాణ

చైతన్యంతో ప్రజల మద్దతు పొందుతున్న బాబు నాయక్

మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- వర్షాకాలంలో ప్రబలే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజన్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు సిపిఎం పార్టీ నాయకుడు బాబు నాయక్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. సామాజిక బాధ్యతతో ముందుండే నాయకుడిగా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమం ప్రజల నుంచి ప్రశంసలు పొందుతోంది.తాజాగా మిర్యాలగూడ మండలంలోని వాటర్ ట్యాంక్ తండాలో బాబు నాయక్ స్వయంగా పాల్గొని నీటి నిల్వలపై శుద్ధి పౌడర్ చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్థానికంగా మునిసిపల్, ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో స్పందించకపోయిన పరిస్థితుల్లో బాబు నాయక్ తీసుకున్న ఈ చర్య గ్రామస్తుల్లో నమ్మకం కలిగించింది.“ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదు. ముందే చొరవ తీసుకుంటే అనేక సమస్యలను నివారించవచ్చు,” అని బాబు నాయక్ వ్యాఖ్యానించారు. ఆయ‌న నేతృత్వంలో సిపిఎం కార్యకర్తలు తండాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, పౌడర్ చల్లడం వంటి నివారణ చర్యలను అమలు చేస్తున్నారు.ప్రజల సమస్యల పట్ల స్పందించే నేతగా బాబు నాయక్ మరోసారి తాను ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారో ఈ చర్య ద్వారా చాటిచెప్పారు.

పాములపహాడ్ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

ఆయిల్ పామ్ సాగులో జిల్లా ఆదర్శంగా నిలవాలి..కలెక్టర్ బాదావత్ సంతోష్

Back to top button