ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

జేఈఈ విద్యార్థుల వివాదం - నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అరకు పర్యటన వివాదాస్పదమైంది. ఆయన పర్యటన సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌తో కొందరు విద్యార్థులు జేఈఈ పరీక్ష రాయలేకపోయారట. ఎగ్జామ్‌ సెంటర్లకు సరైన సమయానికి చేరుకోలేకపోవడంతో… పరీక్ష రాయలేకపోయామని.. పవన్‌ కళ్యాణ్‌ పర్యటన వల్లే అదంతా జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏడుస్తున్న విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పవన్‌కు వ్యతిరేకంగా ఇంత మంచి ఛాన్స్‌ వస్తే… వైసీపీ కార్యకర్తలు వదులుకుంటారా… ఈ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. పవన్‌ పర్యటన వల్ల.. కొందరు జేఈఈ విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం… ఏపీ రాజకీయాల్లో ఇదో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై విశాఖ పోలీసులు క్లారిటీ వచ్చారు.. అవన్నీ తప్పుడు ప్రచారాలని ప్రకటించారు. కొందరు జేఈఈ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లడం వల్ల … పరీక్ష రాయలేకపోయిన మాట వాస్తవమే గానీ.. అందుకు పవన్‌ కళ్యాణ్‌ పర్యటన కారణం కాదని చెప్పారు.


Also Read : అమ్మో.. జగన్‌ అడ్డానా వద్దు వద్దు – ఈసారికి కడప చాలు..!


జేఈఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఉదయం 7గంటల కల్లా పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఉదయం ఎనిమిదున్నర గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారు. ఎనిమిదున్నర గంటల తర్వాత వచ్చిన.. ఏ విద్యార్థినీ లోపలికి అనుమతించరు. అయితే… డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పర్యటన ఉదయం 8గంటల 41 నిమిషాల సమయంలో… ఆ ప్రాంతం మీదుగా వెళ్లిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు… విద్యార్థుల కోసం… గోపాలపట్నం నుంచి పెందుర్తి వెళ్లే సర్వీసు రోడ్డును ఉదయం ఎనిమిదున్నర వరకు ఫ్రీగా ఉంచామన్నారు. కనుక… విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోవడానికి పవన్‌ కళ్యాణ్‌ కారణం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు విశాఖ పోలీసులు.


Also Read : సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ మధ్య వాగ్వాదం – అసలు ఏం జరిగిందంటే..?


ఇక్కడో అనుమానం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పర్యటన ఉంటే… నిన్నటి నుంచే ఆయన వెళ్లే మార్గాల్లో హడావుడి ఉంటుంది. పోలీసులు ఆంక్షలు పెట్టకపోయినా… పార్టీ కార్యకర్తలు… తమ అధినేత కోసం చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఆ మార్గంలో 8 గంటల 41 నిమిషాలకు వెళ్లారు అంటున్నారు. ఆయన వెళ్లిన సమయం సంగతి సరే… ఆయన వస్తున్నారంటే.. ఆ పార్టీ నేతలు చేసే హంగామా…? దాని వల్ల ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు కలిగే ఇబ్బందుల సంగతేంటి..? స్థానిక నేతలు ఓ కార్యక్రమం చేపడితేనే… హడావుడి ఉంటుంది. మరి పవన్‌ కళ్యాణ్‌ పర్యటనకు లేదా..? అన్నది చాలా మంది అనుమానం.


Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజే.. చిన్న కొడుక్కి ప్రమాదం.. పవన్ కల్యాణ్ కన్నీళ్లు 


ఏది ఏమైనా… తన వల్ల జేఈఈ పరీక్షకు కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోయారన్న ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్‌ అయ్యారు. ఇందులో నిజమెంతో నిగ్గుతేల్చాలని ఆదేశించారు. తన కాన్వాయ్‌ కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ ఆపారన్న విషయంపై ఆరా తీయాలని విశాఖ పోలీసులను కోరారు. డిప్యూటీ సీఎం కార్యాయలం కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. తన పర్యటనల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పవన్‌ కళ్యాణ్‌ చెప్తుంటారని… హెలికాప్టర్లలో వెళ్లినా రోడ్లపై ట్రాఫిక్‌ ఆపే సంస్కృతి ఇప్పుడు లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి .. 

  1. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Back to top button