
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆస్పత్రులు పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవీఎస్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార దృక్పథంతో వ్యవహరించవద్దన్నారు. వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికీ జీవితం అందించే గొప్ప వ్యక్తులను రంగారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, గుండ్లపల్లి ధన్‌రాజ్ గౌడ్, కొశికె ఐలయ్య, కుంట గోపాల్ రెడ్డి, కాకుమాను సునీల్, వంగేటి గోపాల్ రెడ్డి, గుండా ధన్ రాజ్, పుల్లగుర్రం విజయానంద్ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు డా.అభిలాష్ రెడ్డి, డా.వంశీధర్ రెడ్డి, డా.శ్రీనివాస్, డా.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Read also : యువకుడి పై 4 అమ్మాయిలు గ్యాంగ్ రేప్..?
Read also : షాకింగ్ న్యూస్… హ్యాక్ కు గురైన తెలంగాణ హైకోర్టు వెబ్సైట్?





