
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- కార్తీకమాసం సందర్భంగా ఎంతోమంది భక్తులు అయ్యప్ప మాలలు ధరించారు. దాదాపు 41 రోజులపాటు అయ్యప్ప స్వామి దీక్షలో పాల్గొంటూ… కేవలం స్వామినే స్మరించుకుంటూ గడిపేటువంటి అయ్యప్ప స్వాములు 41 రోజులు దాటిన తర్వాత శబరిమలకు వెళ్తూ ఉంటారు. శబరిమల లోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని అనంతరం మాలలు తీస్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అక్కడి ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే శబరిమలకు వచ్చే భక్తులు ఉన్నారో వారందరూ కూడా నది స్నానాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అని కోరింది. ఎందుకంటే రాష్ట్రంలో అమీబిక్ మేనింజో ఎన్ సైఫిలిటిస్ ( బ్రెయిన్ ఫీవర్) కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నది స్నానాలు తప్పక చేయాల్సి వస్తే కచ్చితంగా ముక్కుల్లోకి నీరు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వెల్లడించింది. వేడి చేసిన నీటిని తాగాలి అని… అయ్యప్ప స్వాములు అందరూ కూడా తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆహారాన్ని స్వీకరించాలి అని కోరారు. మార్గమధ్యంలో లేదా ఎక్కడైనా సరే అత్యవసర సహాయం కోసం 047352 03232 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది.
Read also : ”దమ్ముంటే పట్టుకోండి” అన్నాడు.. చాలా సింపుల్ గా పట్టుకున్నారు : సివి ఆనంద్
Read also : Prime Minister of Japan: నేను రోజుకు 2 గంటలే నిద్రపోతా





