ఆంధ్ర ప్రదేశ్

ఏపీ మహిళలకు శుభవార్త… ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

  • జీరో ఫేర్‌ టికెట్‌ అమలుకు చంద్రబాబు ఆదేశాలు

  • టికెట్‌పై పథకం లబ్ది వివరాలు పొందుపరచాలి

  • అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సిద్దం చేయాలని ఆదేశాలు

  • పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు

  • ఆర్టీసీని లాభాల పట్టించడమే ధ్యేయం: చంద్రబాబు

క్రైమ్‌మిర్రర్‌, అమరావతి: ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ శుభవార్త తెలిపింది. వచ్చేనెల (ఆగస్టు) 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు జీరో ఫేర్‌ టికెట్‌ జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాల్సిందేనని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకుగాను జీరో ఫేర్‌ టికెట్‌ను మహిళలకు జారీ చేయాలని సూచించారు. టికెట్‌పై ప్రయాణ వివరాలతో పాటు వారికి అందుతున్న సేవ, ఆదాయ అయిన మొత్తం, ప్రభుత్వం 100శాతం రాయితీ ఇస్తుందన్న వివరాలు స్పష్టంగా పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్దిని మహిళా ప్రయాణికులందరికీ తెలియాలన్నారు. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై భారం పడకుండా చూడాలన్నారు.

Read Also: 

  1. హైదరాబాద్‌లో 30 చెరువులకు పునర్జన్మ… హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ
  2. తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button