జాతీయం

రూ.1.50 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ బాధితులకు కేంద్రం ఆసరా!

Road Accident Treatment Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. యాక్సిడెంట్ లో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్- 1988లోని సెక్షన్‌ 162 ప్రకారం ఈ గెజిట్ ను రిలీజ్ చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా హాస్పిటల్లో చేరిన వారిని ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. అయితే, ఈ యాక్సిడెంట్ నిజమైనదా? కాదా? అనేది స్థానికల పోలీసులు 24 గంటల్లో గుర్తించి, సదరు ఆస్పత్రికి తెలియజేయాలి. లేకపోతే కవరేజీ అనేది లభించదు. అయితే, బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చికిత్స అందిస్తారు. రోడ్ యాక్సిడెంట్  బాధితులకు ఈ పథకం కింద నగదు లేకుండా ఏడు రోజుల వరకు చికిత్స అందిస్తారు.

ఈ పథకం ఏ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంటుందంటే? 

ఈ పథకం అన్ని ఆస్పత్రులలో అమలు కాదు. ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం జన్‌ ఆరోగ్య యోజన అమలయ్యే, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) నోటిఫై చేసిన ఆసుపత్రుల్లోఈ స్కామ్ అమలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ బాధితులను యాక్సిడెంట్‌ అయిన ప్లేస్ నుంచి దగ్గర లోని ఇతర హాస్పిటల్ కు తీసుకెళ్తే, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత.. ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లవచ్చు. యాక్సిడెంట్ బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రులు ఈ వివరాలను ఆయా స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీల ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఇక యాక్సిడెంట్ జరిగిన విషయం గురించి అధికారులకు సమాచారం అందించేందుకు 112 నంబర్‌ కు కాల్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేకపోతే ఈడీఏఆర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వచ్చని తెలిపింది. చికిత్స సమయంలో రోడ్డు ప్రమాద బాధితుడు చనిపోతే, హాస్పిటల్ కు రీయింబర్స్‌మెంట్‌ ను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: బిస్కెట్ ప్యాకెట్ ధర రూ.2,400.. కప్పు కాఫీ రూ.1,800!

Back to top button