సినిమా

మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

  • మళయాళ నటుడు మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం

  • మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ప్రకటన

  • చిత్రరంగానికి చేసిన సేవలకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డు

మళయాళ అగ్రకథా నాయకుడు మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం లభించింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు మోహన్‌లాల్‌కు వరించింది. సినీరంగంలో మోహన్‌లాల్‌ చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం మోహన్‌లాల్‌కు ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్‌లాల్‌ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోనున్నారు.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్రరంగానికి మోహన్‌లాల్‌ తన సేవలను అందించారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. ఈనెల 23న జరిగే 71వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో మోహన్‌ లాల్‌కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు అందుకోనున్నారు.

Back to top button