జాతీయం

వరదలో కొట్టుకుపోయిన ఆర్మీ బేస్, 11 మంది జవాన్లు గల్లంతు!

Uttarakhand Flash Floods: ఉత్తరాఖండ్‌ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాలకు గ్రామాలే నామ రూపాలు లేకుండాపోయాయి. కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహాలు దూసుకొచ్చి జనావాసాలను తాకాయి. తాజాగా రెండుసార్లు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.  ఉదృతమైన వరదల ధాటికి  ఆర్మీ క్యాంప్‌ కొట్టుకుపోయింది. అందులో ఉన్న  11 మంది సైనికులు గల్లంతయ్యారు. వీరికోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు

హర్షిల్‌ లోని భారత ఆర్మీ క్యాంప్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న ధరాలి గ్రామ ప్రాంతం సమీపంలో మధ్యాహ్నం 1:45 గంటలకు మెరుపు వరదలు సంభవించాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి ప్రధాన స్టాప్‌ ఓవర్.. అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హోమ్‌ స్టేలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం అంతా వరదలకు తుడిచిపెట్టుకుపోయింది. ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే, సైన్యం 150 మంది సిబ్బందిని విపత్తు ప్రదేశానికి పంపించింది. సహాయక బృందాలు వెంటనే వరదల్లో చిక్కుకున్న గ్రామస్తులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అక్కడి ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడం మొదలుపెట్టాయి.

Read Also: సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత సైన్యం ఏం చెప్పిందంటే?

Back to top button