
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రముఖ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో కు ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రీడా పరంగా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా క్రిస్టియానో రోనాల్డ్ పూర్తి గుర్తింపుతో పాటుగా రికార్డు కూడా సృష్టించాడు. అయితే ఒక్క 30 రోజుల్లోనే అతనికి బిగ్ షాక్ తగిలింది. కేవలం 30 రోజుల్లోనే అతను పది మిలియన్ల ఫాలోవర్స్ కోల్పోయారు. క్రిస్టియానో రోనాల్డ్ X ( ట్విట్టర్) ఖాతాలో నవంబర్ నెల మొదటి వారంలో చూస్తే 115 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఆ సంఖ్య ఇవాల్టి రోజుకు 105 మిలియన్లకు చేరింది. దీంతో ఒకవైపు క్రిస్టియనో రోనాల్డో మరోవైపు అతని అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఇంతలా పది మిలియన్ల మంది ఫాలోవెర్లు తగ్గిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయని పలువురు చెప్తున్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్లు తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఫేక్ ఎకౌంట్ల తొలగింపు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు నవంబర్ 18వ తేదీన ట్రంప్ తో భేటీ అవ్వడం కారణంగానే ఈ ప్రభావం చూపించింది అని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ నచ్చని వారు చాలామంది ఉంటారు. బహుశా ఆ మీటింగ్ కారణంగానే చాలామంది అతనిని అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది.
Read also : బ్రతికిన మళ్లీ తెలంగాణ కోసమే చస్తా .. అమరుడా నీకు “జోహార్లు”!
Read also : 20 Minute Marriage: అత్తింటికి వచ్చి 20 నిమిషాల్లోనే విడాకులు.. ఇదేం ట్విస్ట్ రా మావా?





