తెలంగాణ

కందుకూరులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ సమన్వయ సమావేశం

మహేశ్వరం ప్రతినిధి (ప్రతినిధి):-
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం టక్కరి రామ్ రెడ్డి గార్డెన్ లో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్చార్జి వినోద్.ఈ సందర్బంగా మాట్లాడుతూ..భారతదేశ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎన్నో త్యాగాలు చేసి నిర్మించుకున్న ఈ దేశంలో రాజ్యాంగాన్ని వాటి ఉద్దేశాన్ని, అదేవిధంగా మహనీయుల గొప్పతనాన్ని తెరమరుగు చేసే కుట్రలు జరుగుతున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించడమే ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ ముఖ్య ఉద్దేశ్యమని ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇన్చార్జి వినోద్ తెలియజేశారు.నియోజవర్గంలో అన్ని బ్లాక్‌లు, వార్డులలో గ్రామాలలో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో అభియాన్’ కాంగ్రెస్ పార్టీ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టనుందనీ కేఎల్ఆర్ తెలిపారు.

213 క్వింటాల పిడిఎస్ బియ్యం పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు

జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందనీ పేర్కొన్నారు. గ్రామ, పట్టణ స్థాయుల్లో జరగనుందనీ వివరించారు. దేశంలో మత చందోసవాదుల ప్రభుత్వాలు చేస్తున్న విచ్చినాన్ని చూసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను కూడా ప్రారంభించనుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ, రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని, బిఆర్ అంబేద్కర్‌ను బిజెపి అగౌరవపరిచిందని ఆరోపిస్తూ, రాజకీయ వివాదంలో చిక్కుకున్నందున కాంగ్రెస్ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుందని తెలిపారు. అయితే, చరిత్రలో అనేక సందర్భాల్లో అంబేద్కర్‌ను అవమానించిన బిజెపి ప్రభుత్వం తన రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి రాజ్యాంగాన్ని సవరించిందని కెఎల్ఆర్ ఆరోపించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేరుకేనా మర్రిగూడ మోడల్ స్కూల్.. మోడల్ స్కూల్ అభివృద్ధి నిధులపై విచారణ జరపాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button