జాతీయం

కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు

  • రేప్‌ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు

  • ఇవాళ శిక్ష ఖరారు చేసిన బెంగళూరు కోర్టు

  • బాధితురాలికి రూ.7లక్షలు చెల్లించాలని ఆదేశం

  • అత్యాచారం చేసి బెదిరించాడని ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు

  • అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరించాడని ఆరోపణ

  • మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ

క్రైమ్‌మిర్రర్‌, బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది బెంగళూరు ప్రత్యేక కోర్టు. మహిళపై అత్యాచారం కేసులో రేవణ్ణను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. శనివారం రోజున శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రేవణ్ణకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు బాధితురాలికి రూ.7లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

2వేల పేజీల నివేదిక

కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన మొత్తాన్ని రికార్డ్‌ చేసి బెదిరించాడని గత ఏడాది బెంగళూరు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం 2వేల పేజీల నివేదికను కోర్టుకు అందజేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ఫోరెన్సిక్‌ ఆధారాలనూ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు సంచలనం

గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కర్ణాటకలో సెక్స్‌ కుంభకోణం సంచలనం సృష్టించింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ తనపై అత్యాచారం చేసి, బెదిరించాడని ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. బెంగళూరులోని తన నివాసంలో ప్రజ్వల్‌ తనపై అత్యాచారం చేశాడని, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. తన తల్లి సెల్‌కు వీడియో కాల్‌ చేసి బట్టలు విప్పించేవాడని, ఎవరికైనా చెబితే నీ తల్లిని, నిన్ను చంపేస్తానని బెదిరించాడని బట్టబయలు చేసింది. ప్రజ్వల్‌ తనతో పాటు చాలామందిని ఇలాగే చేశాడని పేర్కొంది.

Read Also: 

  1. మంత్రి పదవి వద్దనలేదు, ఏ బాధ్యత ఇచ్చినా ఓకే: సంజయ్‌
  2. పచ్చని పొలాల మధ్య.. మండుటెండలో… చంద్రబాబు నాయుడు ప్రసంగం!
Back to top button