
క్రైమ్ మిర్రర్, బెంగుళూరు:- ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత బెంగళూరు జట్టు మొట్టమొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ 18 సంవత్సరాలు కూడా విరాట్ కోహ్లీ ఈ జట్టులోనే భాగమై ఉన్నాడు. ఇప్పటికే బెంగళూరు లో ఎంతో ప్రాముఖ్యత చెందిన చిన్న స్వామి స్టేడియం అందరికీ సుపరిచితమే. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖమైన నగరాలలో బెంగళూరు ఒకటి. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం తో పాటుగా మరొక భారీ క్రికెట్ స్టేడియాన్ని బెంగళూరులో నిర్మాణం కాబోతుంది. దాదాపు 1650 కోట్లతో ఈ కొత్త స్టేడియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని బొమ్మ సంద్రలోని సూర్య సిటీలోని మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ స్టేడియం నిర్మించబోతున్నారు.
Read also : కమల్ హాసన్‌పై తీవ్ర బెదిరింపులు.. తల నరికేస్తానంటూ వార్నింగ్!
ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నూతన క్రికెట్ స్టేడియానికి ఆమోదం కూడా తెలిపారు. ఇక ఈ స్టేడియంలో దాదాపు 80000 మందికి సిట్టింగ్ కెపాసిటీ ఉండడంతో… ఈ స్టేడియం పూర్తిగా ప్రారంభించినట్లయితే అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం తరువాత దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ మైదానంగా ఈ స్టేడియం నూతన రికార్డును సృష్టించడం పక్కా అని తెలుస్తుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం కెపాసిటీ 1.32 లక్షలు. ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన తర్వాత.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది ప్రాణాలు పోయాయి. ట్రాఫిక్ అలాగే కొన్ని సమస్యలు దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహణ చాలా కష్టంగా మారుతున్న సందర్భంలో.. ఇప్పుడు కొత్త స్టేడియం అవసరమన్న ఉద్దేశంతోనే ఈ మైదానం నిర్మాణానికి పూనుకుంటున్నట్లుగా సమాచారం అందింది.
Read also : టర్కీని వణికించిన పెను భూకంపం, కుప్పకూలిన పలు భవనాలు!