తెలంగాణ

నేనే ఎక్కువసార్లు గెలిచా.. సీఎం పదవిపై ఉత్తమ్ సంచలనం!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పట్టాలెక్కించింది. రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు శ్రీకారం చుట్టింది. అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది. అయితే రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఒక్కొ జిల్లాకు వెళ్లి ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.

సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లా సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. వలిగొండ మండలం నాతాళ్ళగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సమావేశంలో నాలుగు సంక్షేమ పథకాలను మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించా రు. కార్యక్రమం లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ లో ఎక్కువ సార్లు గెలిచింది తానేనని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ లో తానే సీనియర్ అన్నట్లుగా మాట్లాడారు.

తానే ఎక్కువసార్లు గెలిచానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కంటే తానే సీనియర్ అని అర్ధం వచ్చేలా ఉత్తమ్ కామెంట్ చేశారనే చర్చ సాగుతోంది. సీఎం పదవి తాను రేసులో ఉన్నాననే సంకేతం ఇచ్చారంటున్నారు.

Back to top button