
నల్గొండ, క్రైమ్ మిర్రర్:- ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా
నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఎక్కడ లేని విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని స్టేషన్లో ఈ కార్యక్రమం నిర్వహించగా జిల్లాలోని అన్ని స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం జరగనుంది.
రేపు అనగా శనివారం డిండి పోలీసు స్టేషన్లో ఉదయం 11.00 గంటలకు మీట్ యువర్ యస్పి కార్యక్రమాన్ని నిర్వహించానున్నారు. బాధితుల యొక్క ఫిర్యాదులను పోలీసు స్టేషన్లలోనే పరిశీలించి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.కావున ప్రజలు తమ సమస్యల గురించి ఎస్పి ని స్వయంగా కలిసి దరఖాస్తులు సమర్పించేందుకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: