జాతీయం

ఒకే రోజు రూ.5 వేలు జంప్, ఆల్ టైమ్ హైకి సిల్వర్ రేటు!

Gold-Silver Rate: బంగారం, వెండి ధరలు రోజులు రోజుకు మరింత పెరిగుతున్నాయి. బంగారం ధర కొంచమే పెరిగినా, వెండి ధర మాత్రం భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ఒకే రోజు రూ.5 వేలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1.15 లక్షలు పలుకుతోంది. రెండు రోజుల ముందు కూడా కిలోకు రూ.4500 పెరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 10,000 వేలు పెరగడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు.

అటు తాజాగా బంగారం ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,570కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.200 పెరిగి రూ.99 వేల మార్క్‌ ను అందుకుంది. ఇల్‌ ఇండియా సరాఫా అసోసియేసన్‌ ధ్రువీకరించింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి రూ.2,135 పెరిగి కిలోకు రూ.1,15,136 రికార్డు ధరకు చేరుకుంది.  అంతర్జాతీయ మార్కెట్‌ లో వెండి స్పాట్‌ 1.71 శాతం పెరిగి ఔన్స్‌ కు 39.02 డాల్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరిగి ఔన్స్‌ కు 3,371.14 డాలర్లకు చేరుకుంది.

14 ఏండ్ల గరిష్టానికి వెండి ధర

వెండి 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వెల్లడించారు. అమెరికా సుంకాల అనిశ్చితి మధ్య డాలర్‌ బలహీనపడింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు లోహాలపై ఆసక్తి చూపడంతో డిమాండ్‌ పెరిగిందన్నారు.  అదే సమయంలో బంగారం ప్రత్యామ్నాయంపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో భారీగా ధరలు పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రపంచ సుంకాల ఉద్రిక్తతలు మళ్లీ మొదలవడంతో బంగారం ధరలు సానుకూల ధోరణిని చూస్తున్నాయన్నారు.

Read Also: పసిడి ధరకు రెక్కలు, ఈ వారంలో లక్ష దాటుతుందా?

Back to top button