జాతీయంరాజకీయం
Trending

ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఇతడే!… డిసైడ్ చేయబోతున్న బిజెపి అధిష్టానం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బిజెపి గెలుపు చివరి దశకు చేరుకుంది. బిజెపి అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలు కనబడుతున్నాయి. చివరిసారిగా 1993లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత మరోసారి ఢిల్లీ శాసనసభలో అధికారాన్ని గుప్పెట్లోకి తీసుకోబోతుంది. కాగా 2014లో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బిజెపికి ఢిల్లీ అసెంబ్లీలో అధికారం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలని పట్టుదలతో బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. చివరికి ఆ కలలోనేవి మరికొద్ది క్షణాల్లో నెరవేరబోతున్నాయి.

బిజెపికి కలిసోచ్చిన చంద్రబాబు ప్రచారం!….. అత్యధిక మెజారిటీతో ముందంజ?

ఢిల్లీలో ఎలక్షన్లలో బిజెపి గెలవడమే కాకుండా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడించాలని గట్టిగా లక్ష్యం పెట్టుకుని బిజెపి. అందుకు వ్యూహాలు రచిస్తూనే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేస్ సాహిబ్ సింగను పోటీకి ఎదురుగా నిలబెట్టింది. దీంతో ఎన్నికలకు ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ పర్వేష్ నే ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేస్ సీఎం చేస్తారని ప్రచారం ఆ సామాజిక వర్గ ఓట్లను బిజెపి ఎక్కువగా ఆకర్షించింది. అనుకున్నట్టుగానే కేజ్రీవాల్ పైన పరమేష్ 3182 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి పర్వేష్ కే లభిస్తుందని అందరూ అంటున్నారు

రక్షకులే యమ బక్షకులై…. బాధితురాలిని చంపెయ్యమంటూ ఓ పోలీస్ అధికారి సూచన..?

Back to top button