
క్రైమ్ మిర్రర్, రాజకీయ న్యూస్ :-
బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేడు జరిగిన ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని.. బీహార్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వైఫై ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేశారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే నేడు జరుగుతున్న కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా బీహార్ రాష్ట్రంలో మళ్లీ ఎన్టీఆర్ ప్రభుత్వమే గెలిచే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వరకు కూడా తమకు అధికారం దొరుకుతుంది అని ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురయింది. NDA భారీ విజయాన్ని నమోదు చేసే దిశగా వెళుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులు అసలు ఊహించలేకపోతున్నారు. అయితే ఈసారి కూడా బీహార్ ఎన్నికలలో ఓటమి దిశగా వెళ్లడానికి చాలానే కారణాలు ఉన్నాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. బీసీ మరియు ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంకు కోల్పోవడం, SIR అలాగే ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పూర్తిగా విఫలమైనట్లుగా భావిస్తున్నారు. మరోవైపు గతంలో NDA పార్టీలో ఉన్నవారికే మళ్ళీ ఈసారి అభ్యర్థులుగా నిలబెట్టడంతో చాలామందికి నచ్చలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ బీహార్ ఎన్నికలలో ఓటమికి గల కారణాలుగా కొంతమంది కాంగ్రెస్ రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం NDA పార్టీ 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండి తన హవా ని కొనసాగిస్తుంది.
Read also : Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఎన్నికలు రౌడీ రాజ్యంలో జరిగాయి
Read also : జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ప్రచారం చేసుంటే.. ఫలితాలు తారుమారయ్యేనా?





