తెలంగాణరాజకీయం

సర్పంచ్ గా గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా : స్వతంత్ర అభ్యర్థి

క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బ్రాహ్మణపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా నిలుపుతానని స్వతంత్ర అభ్యర్థి కోరుకోరు తిరుపతి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్లను కలుస్తూ తాను గెలిచిన తర్వాత చేసే పనుల గురించి వివరిస్తూ ప్రచారం సాగించారు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మూడు పార్టీల సపోర్ట్ ఉందని సర్పంచ్ గా గెలిచిన అనంతరం గ్రామంలో ప్రధాన సమస్య అయిన స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, అదేవిదంగా వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో చాలా మందికి పింఛన్లు అందడం లేదని సర్పంచ్ గా గెలిచిన తర్వాత వారికి పింఛన్లు వచ్చే విధంగా తిరుపతి చేస్తానని చెప్పారు.

Read also : సౌత్ ఆఫ్రికాతో t20 మ్యాచ్ కు బుమ్రా దూరం.. కారణం ఇదే?

Read also : “మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్”.. ఉపాసన రికార్డ్!

Back to top button