
క్రైమ్ మిర్రర్, సస్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఘనవిజయం సాధించిన తరువాత జట్టులోని ప్రతి సభ్యురాలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు మొదలుకొని ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా భారత మహిళల జట్టును మెచ్చుకున్నారు. ఆ తరువాత ఎన్నో రకాలుగా జట్టులోని ప్రతి సభ్యురాలికి అదృష్టం వరించింది అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు గుజరాత్ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త వజ్రాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు తాజాగా భారత జట్టులో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలికి కూడా టాటా కంపెనీ నుంచి తాజాగా లాంచ్ అయినటువంటి టాప్ ఎండ్ మోడల్ కారును గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు. వరల్డ్ కప్ విజేతలు మరియు రీఎంట్రీ ఇస్తున్న లెజెండ్రీ టాటా సియర్ర రెండు కూడా పట్టుదల, ధైర్యం మరియు స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కంపెనీ కొనియాడింది. కాగా ఈనెల 25వ తేదీన ఈ టాటా మోటార్స్ టాప్ ఎండ్ న్యూ కార్ ను లాంచ్ చేయనున్నారు. దీంతో భారత జట్టు గెలవడంతో పాటు జట్టులోని ప్రతి సభ్యురాలికి అదృష్టం పట్టింది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Read also : అవన్ని అవాస్తవాలు.. సచివాలయాల పేరు మార్చలేదు : CMO
Read also : “ది గర్ల్ ఫ్రెండ్” రివ్యూ… రష్మిక మరో మెట్టు ఎక్కినట్టే!





