
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ చరిత్రలో ఇంతటి బలహీనమైన ముఖ్యమంత్రిని చూడనేలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న మంత్రులపై నీకు ఎలాంటి పట్టు లేదని ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని… ఈ విషయంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. ఒక బలహీనమైన ముఖ్యమంత్రివి నువ్వు. సిగ్గు ఉంటే పాలనపై పట్టు అనేది నిరూపించుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడు లేనటువంటి అవినీతి జరుగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసేటువంటి అవినీతికి ప్రభుత్వ అధికారులు సైతం భయపడిపోతున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇంతటి దారుణమైన అవినీతి పనులపై బీజేపీ పార్టీ ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిని నా జీవితంలోనే చూడలేదంటూ… మంత్రులు కూడా సీఎంపై ఎగసిపడడమేంటని… ఒకవేళ మంత్రులు సీఎం పై ఫైరైన మీరు చేసేది తప్పని సీఎం ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఒక పరిపాలన చేతకాదు, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చేతకాదు, మంత్రులను పట్టులో పెట్టుకోవడం కూడా చేతకాదు… అని రేవంత్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రేవంత్ ను వదిలించుకుంటేనే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది అని ఓ కార్యక్రమంలో భాగంగా తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
Read also : రెండవసారి డక్ అవుట్ అయిన కోహ్లీ.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో రోహిత్..!
Read also :ఓటీటీ లో అడుగుపెట్టిన OG.. మరో రికార్డు సృష్టిస్తుందా?.





