
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా.. మూడో రౌండ్ వచ్చేసరికి లెక్కలు తారుమారయ్యాయి. మూడవ రౌండ్ లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించగా ఇందులో బిఆర్ఎస్కు స్వల్ప ఆదిక్యం 211 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా 12,292 ఓట్లు పడగా.. టిఆర్ఎస్ పార్టీకి 12,503 ఓట్లు పడ్డాయి. ఇక మరోవైపు బిజెపి పార్టీకి 401 ఓట్లు పోలయ్యాయి. దీంతో మూడో రౌండ్లో బిఆర్ఎస్ పార్టీ 211 ఓట్లతో ముందంజలో దూసుకు వెళ్తుంది. అయితే మూడు రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. మరింత సమాచారం మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో పొందుపరుస్తూనే ఉంటాం. కాబట్టి మన ఈ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ పై కూడా ఒక కన్ను వేసి ఉంచండి.





