
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఒక సినిమా బాగుందంటే ఎంతలా ఆదరిస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. చిన్న సినిమా అయినా లేదా పెద్ద సినిమా అయినా కేవలం కథ బాగుంటే చాలు ఒకవైపు ప్రశంసల వర్షం మరోవైపు వసూళ్ల వర్షం కురిపిస్తారు. దానికి ఉదాహరణ చిన్న సినిమా బలగం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక హీరో పై అభిమానం పెంచుకుంటే… వారి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు కూడా సినిమాని మూవీ బృందం కన్నా అభిమానుల బృందమే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఈమధ్య వచ్చే ప్రతి సినిమా కూడా రెండు పార్టులుగా వస్తున్నాయి. పార్ట్ 2 ఆలోచనలతో వచ్చేటువంటి సినిమాల కథలు అన్నీ కూడా పక్క దారి పడుతున్నాయి. స్టోరీని ఒకే పార్టీలో చెప్పే స్కోపు ఉన్నప్పటికీ కూడా ఆయా స్టార్ హీరో క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కథనాన్ని సాగుదీస్తూ ఉన్నారని సినీ విశ్లేషకుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.
Read also బ్రేకింగ్ న్యూస్!.. తిరుమలలో రీల్స్ చేస్తే జైలుకే?
పార్ట్ 2 ల కోసం… సినిమాల కథలను సాగదీయడం వల్ల చాలా మంది ప్రేక్షకుల్లో అసంతృప్తి అలాగే అసహనం అనే భావనలు కలుగుతున్నాయి. తాజాగా వచ్చినటువంటి రాబిన్ హుడ్ మరియు రామారావు అండ్ డ్యూటీ వంటి చిత్రాలు ఇలాంటి ఫలితాలను చవిచూసాయి. అయితే గతంలో బాహుబలి అలాగే కేజిఎఫ్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుష్ప పార్ట్ 2 సినిమాలు ఎంత బాగా హిట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ప్రతి ఒక్క సినిమా కూడా బాహుబలి లేదా పుష్పాలాగా కాలేవు అని… సినిమా విశ్లేషకులు తో పాటుగా అభిమానులు కూడా చాలామంది మండిపడుతున్నారు. ఏదైనా ఎక్కువ కథ ఉంటే తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని సినిమా విశ్లేషకులు సూచిస్తున్నారు.
Read also నిందితులంతా నిర్దోషులే.. మాలేగావ్ కేసులో సంచలన తీర్పు!