జాతీయం

Smart phones: వామ్మొ.. లిస్ట్ పెద్దదే! డిసెంబర్‌లో రాబోతున్న కొత్త ఫోన్లు ఇవే..

Smart phones: భారత మార్కెట్లో మొబైల్ ఫోన్ల రద్దీ ఏ నెలలోనైనా తగ్గదు. కొత్త టెక్నాలజీలు, అప్‌డేటెడ్ ఫీచర్లు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల కనీసం ఐదు నుంచి పది వరకు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ లాంచ్ అవుతుండటం ఇప్పుడు సాధారణ విషయమే.

Smart phones: భారత మార్కెట్లో మొబైల్ ఫోన్ల రద్దీ ఏ నెలలోనైనా తగ్గదు. కొత్త టెక్నాలజీలు, అప్‌డేటెడ్ ఫీచర్లు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల కనీసం ఐదు నుంచి పది వరకు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ లాంచ్ అవుతుండటం ఇప్పుడు సాధారణ విషయమే. ఇదే ధోరణి డిసెంబర్ నెలలో కూడా కొనసాగనుంది. ప్రముఖ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త సిరీస్‌లను ప్రకటించాయి. డిసెంబర్ 2వ తేదీన వివో X 300 సిరీస్ భారత్‌లో తొలి అడుగు పెట్టనుందని తెలిసింది. ఈ ఫోన్ అందించే ప్రీమియం ఫీచర్లను దృష్టిలో పెట్టుకుంటే దీని ధర సుమారు రూ.75,999ల వరకు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇది ముగిసిన వెంటనే పోకో కూడా తన కొత్త మోడల్ F8‌ను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పోకో ఫోన్లకు భారత మార్కెట్లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ మోడల్‌ కోసం యువతలో మంచి ఆసక్తి నెలకొని ఉంది. అదే విధంగా వన్ ప్లస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OnePlus 15R ఫోన్ డిసెంబర్ 17వ తేదీ ఉదయం అధికారికంగా రిలీజ్ కానుందని కంపెనీ ప్రకటించింది. పనితీరు, కెమేరా, చార్జింగ్ టెక్నాలజీ విషయంలో ఇది భారీ అప్‌గ్రేడ్‌తో రానుందని అంచనా. దీని ధర సుమారు రూ.45 వేలు ఉండవచ్చని సమాచారం.

ఇక డిసెంబర్ చివరి వారంలో మరో రెండు ప్రముఖ సిరీస్‌లు మార్కెట్లోకి రానున్నాయి. OPPO Reno 15 సిరీస్, Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ అవుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సిరీస్‌లు సాధారణంగా డిజైన్, స్టైల్, కెమేరా క్వాలిటీ కోసం ప్రసిద్ధి పొందినవి కావడంతో వీటి ప్రకటనకే వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మరోవైపు నథింగ్ కంపెనీ కూడా తన మినిమల్ డిజైన్‌తో ప్రత్యేకత సాధించిన Nothing Phone 3a Lite ను నవంబర్ 27న మార్కెట్లోకి తీసుకురానుంది. అదేవిధంగా iQOO 15 మాత్రం ఇప్పటికే తన లాంచ్ వివరాలను ప్రకటించింది. ఇవాళే అధికారికంగా విడుదల కానుంది. మొత్తానికి డిసెంబర్ నెల భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ కోసం కొత్త మోడళ్లతో నిండే నెలగా మారనుంది.

ALSO READ: Series loss to South Africa.. WTC ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి పడిపోయిన భారత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button