
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్, పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్‌లో ఆర్ట్ విభాగాన్ని “ఆర్ట్ మాఫియా”గా అభివర్ణించిన ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.అసోసియేషన్ ప్రకటనలో, “సినిమా కథను దర్శకుల ఊహ ప్రకారం దృశ్యరూపంలో చూపించడంలో ఆర్ట్ డైరెక్టర్స్ కీలక పాత్ర పోషిస్తారు. సెట్స్ నిర్మాణం, బడ్జెట్, మార్పులు..నిర్మాత, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సమన్వయంతోనే జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఖర్చులు పెరగడం, తగ్గడం సహజం. ఈ విషయాలు నిర్మాతలకు కూడా తెలుసు” అని పేర్కొన్నారు.
Read also : చంద్రబాబు మాట వినకపోతే పోలీసు అధికారులు కూడా జైలుపాలే: వైయస్ జగన్
విశ్వప్రసాద్ గతంలో పలు సినిమాలు నిర్మించి, వందలాది కార్మికులకు ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపినా, మీడియా ముందు మొత్తం ఆర్ట్ విభాగాన్ని తప్పుబట్టడం అనుచితమని అసోసియేషన్ స్పష్టం చేసింది. “ఏదైనా సమస్య ఉంటే, అది ఫిలింఛాంబర్ లేదా అసోసియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ ‘మాఫియా’ వంటి పదాలు వాడటం ఆర్ట్ డైరెక్టర్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉంటుంది” అని తెలిపింది. అసోసియేషన్ ప్రతినిధులు, “మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేయడానికి వచ్చిన అనేక మంది ఆర్ట్ డైరెక్టర్స్ తమ కుటుంబాలకు దూరంగా అంకితభావంతో పనిచేస్తున్నారు. దేశ, విదేశ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతిభావంతులైన ఆర్ట్ డైరెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. మారుతున్న టెక్నాలజీలను అనుసరించి మేము మా సభ్యుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని గుర్తు చేశారు.
Read also : నేడే లెఫ్ట్ హ్యాండర్స్ డే!.. వీళ్ళకి ఆ పవర్స్ ఎక్కువ?