ఆంధ్ర ప్రదేశ్

కొమ్మినేని అరెస్ట్‌, సాక్షి ఆఫీసు ధ్వంసంపై జగన్‌ కౌంటర్‌ - మహిళపై టీడీపీ నేతల వ్యాఖ్యల వీడియో రిలీజ్‌

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :  ఏపీ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. సాక్షి టీవీ డిబేట్‌లో… జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడారాని.. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ అడ్డుకోలేదని… ఫిర్యాదులు రావడంతో… పోలీసులు కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు. కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. కొమ్మినేనికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇదిలా ఉంటే… ఏలూరు సాక్షి ఆఫీసును కొంతమంది తగలబెట్టారు. దీంతో… ఏపీలో పరిస్థితులు కూటమి వర్సెస్‌ వైసీపీగా మారిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ చేసిన ట్వీట్‌.. టీడీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి విషప్రచారం చేసి.. ఆయన్ను అరెస్ట్‌ చేయడమే కాకుండా.. సాక్షి ఆఫీసుల మీద ప్లాన్‌ ప్రకారం దాడులు చేయించారని ట్వీట్‌ చేశారు జగన్‌. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి.. ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. చంద్రబాబు, బాలకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను, లోకేష్‌.. స్విగ్గింగ్‌ పూల్‌లో మహిళలతో ఉన్న ఫొటోలతో కలిపి ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు జగన్‌. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా…? అని చంద్రబాబు మాట్లాడటం మహిళలను కించపరడం కాదా..? అని ప్రశ్నించారు జగన్‌. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలన్న బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఇలా మాట్లాడటం.. మహిళలను గౌరవించడామా…? అని నిలదీశారు జగన్. దీన్ని బట్టి… మహిళపై చంద్రబాబుకు, ఆయన బావమరిది బాలకృష్ణకు మహిళ పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంద్నారు.


Also Read : సింగర్ మంగ్లీ అరెస్ట్! బర్తే డే పార్టీలో గంజాయి


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు జగన్‌. అందుకు అనంతపురంలో ఇంటర్‌ విద్యార్థిని తన్మయి హత్యకే నిదర్శనమని ట్వీట్‌ చేశారు. కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన… ఆరు రోజుల తర్వాత అమ్మాయి శవమై కనిపించిందన్నారు. ఇది ఎవరి వైఫల్యం అని ప్రశ్నించారు జగన్‌. ఏపీలో శాతం భద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయన్నారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక సీఎంగా ప్రజలు చంద్రబాబును చూస్తుంటే… వీటి నుంచి దృష్టిమరల్చేందుకు… డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఫైరయ్యారు జగన్‌. ఈ ట్వీట్‌తో పాటు జగన్‌ పెట్టిన, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌ వీడియోను వైసీపీ శ్రేణులు తెగ వైరల్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ ఒక్క వీడియోతో జగన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారని అంటున్నారు.

మరోవైపు… జగన్‌ ట్వీట్‌కు కూటమి నేతలు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు. జగన్‌కు మహిళల పట్ల గౌరవం ఉంటే… తల్లి, చెల్లి ఎందుకు యాంటీ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై ఆయన సోదరి చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దీనిపై చర్చకు సిద్ధామా అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు ఎటు పోతున్నాయో అర్థం కావడంలేదంటున్నారు సామాన్యులు.

Back to top button