తెలంగాణ

మోతీనగర్ సదర్ వేడుకల్లో మస్తాన్ రెడ్డి

కూకట్ పల్లి నియోజకవర్గం మోతీనగర్‌లో సదర్ సంబరాలు ఘనంగా జరిగాయి. అఖిల భారత మహాసభ తిరుమలేశ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు. యాదవ సోదరులు దున్నపోతులను సంప్రాదాయబద్దంగా అందంగా అలంకరించి ఊరేగించారు. అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత దేవరింటి మస్తాన్ రెడ్డి సదర్ సంబరాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డిని సదర్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సదర్ సంబరాల్లో సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం యాదవ్ కూడా పాల్గొన్నారు.

Back to top button