
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసిపి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థించాలని కేఏ పాల్ అన్నారు. ఇక తాజాగా విశాఖపట్నంలో జరిగిన కేఏ పాల్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో ఈ మాటలు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని… అలాగే ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని ఆ దేవుడిని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. ఇక యువ గళం యాత్రలో భాగంగా మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన రెడ్ బుక్ ప్రకారం చూసుకుంటే త్వరలోనే కొడాలి నాని మరియు రోజా అరెస్టు అవుతారని అన్నారు. ఇక రాష్ట్రంలో బూతులు తిట్టిన వారిపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
1.న్యూడ్ కాల్ ఉచ్చులో ఇరుక్కున్న నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే