తెలంగాణ

ఆటో కిరాయి విషయంలో ఘర్షణ.. ఎయిర్ గన్ తో కాల్పులు!

క్రైమ్ మిర్రర్, శంషాబాద్ :- రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో ఒక ఆటో కిరాయి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమీర్ దాస్ మరియు పింటూ హట్టి ఇద్దరు మధ్యరాత్రి నర్కూడాలో కిరాయి ఆటో మాట్లాడుకున్నారు. ఆటో కిరాయి విషయంలో ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంలో ఆటోలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సమీర్ దాస్ కడుపులో ఎయిర్ గన్‌తో కాల్పులు జరపగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీర్ దాస్ అల్లుడు పింటూ హట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read also : తాళ్లరేవు పోస్టాఫీసులో ఉద్యోగి నిర్వాకం…ఫోన్‌లో అశ్లీల వీడియోలు

Read also : హైదరాబాదుకు చేరుకున్న జగన్.. చూసేందుకు ఎగబడ్డ జనం!

Back to top button